J. Surender Kumar,
ధర్మపురి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు అలుక వినోద్, ప్రధాన కార్యదర్శి రౌతు రాజేష్, సంయుక్త కార్యదర్శి బందెల రమేష్, క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి మామిడల శ్రీకాంత్, గ్రంథాలయ కార్యదర్శి రామడుగు రాజేష్, సీనియర్ ఈసీ మెంబెర్ తిరమందస్ సత్యనారాయణ, ఈసీ మెంబెర్స్ ఇమ్మడి శ్రీనివాస్, గూడ జితేందర్ రెడ్డి, జాజాల రమేష్ , కరవత్తుల భావన, బత్తిని ఇంద్రకరణ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సివిల్ జడ్జి శ్యాం ప్రసాద్ , ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి రాజేష్, సీనియర్ న్యాయవాదులు గడ్డం లింగారెడ్డి, దుమ్మెన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
జగిత్యాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా శ్రీపాల్ రెడ్డి!
జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే శ్రీ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిటీ రామకృష్ణారావు లు మిగతా కార్యవర్గం శుక్రవారం ఎన్నికల అధికారి టీ జీ ప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు.
జాయింట్ సెక్రెటరీ మారుతి, లైబ్రరీ కార్యదర్శి సంస్కృతిక కార్యదర్శిగా పి సతీష్ మహిళా ప్రతినిధిగా పి వనిత,
కార్యవర్గ సభ్యులుగా ఎన్ వెంకటేష్, జి మహేష్, ఎస్ కరుణాకర్, కే గంగరాజు, ఆర్ విజయ్ కుమార్, ఏ. పురుషోత్తం, ఆర్ జీవన్, కే సురేష్, ఎండి సలీమ్, ఎన్నికైనట్టు ప్రకటనలో పేర్కొన్నారు.