ధర్మపురి చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ..
@ 17 ఏళ్లుగా ప్రథమ పౌరురాలు !

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా


ప్రజాక్షేత్రంలో ఓటమి ఎరుగని మహిళ గూర్చి…


J. SURENDER KUMAR,

ప్రజా క్షేత్రంలో వార్డు సభ్యుడిగా గెలిచి తన పదవీకాలం లో సేవలందించిన గెలుపు ఓటముల పై అనుమానాలు నేటి రాజకీయ పరిస్థితులలో నెలకొని ఉన్న విషయం తెలిసిందే.
ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించిన బీసీ మహిళ గత 17 ఏళ్లుగా ధర్మపురి పట్టణ ప్రథమ పౌరుగాలిగా, మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న సంగి సత్యమ్మ, గూర్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా


2006 నుంచి 2011 వరకు, 2013 నుంచి 2018 వరకు ధర్మపురి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఆమె ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో రెండుసార్లు ఘన విజయం సాధించి సర్పంచ్ గా బాధ్య తలు నిర్వహించారు. ధర్మపురి మేజర్ పంచాయతీ, మున్సిపాలిటీగా రూపాంతరం. చెందిన తొలి మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కౌన్సిలర్ గా గెలిచి 2020 లో తొలి ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికై విధుల్లో కొనసాగుతున్నరు.

వేసవిలో తాగునీటి ఎద్దడి సందర్భంగా తన వార్డులో ట్యాంకర్ ద్వారా ఇంటింటికి నీళ్లు పోస్తున్న దృశ్యం ఫైల్ ఫోటో

భర్త స్వర్గీయ సంగీ కిష్టయ్య, సైతం గతంలో ధర్మపురి సర్పంచ్ గా గెలిచారు. భర్త రాజకీయ అడుగుజాడలే ఆదర్శం అని ఆమె అనేక సందర్భాల్లో వివరించారు. సత్యమ్మ రాజకీయ ప్రస్థానంలో. అనేక ఎత్తు పల్లాలు చూశారు. గోదావరి వరదల సందర్భంగా ముంపుకు గురవుతున్న ఇళ్లల్లో వారిని ఖాళీ చేయించడం, వేసవిలో తాగునీటి ఎద్దడి సందర్భంలో వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలలో ఆమె అధికార యంత్రాంగం తో కలిసి. విధులు నిర్వహించడం మినహా ఆమె చర్యలు వివాదాస్పదం కాలేదు.

గోదావరి వరదల్లో గురవుతున్న పిల్లను ఖాళీ చేస్తున్న దృశ్యం వర్షంలో ఫైర్ ఫోటో.

సత్యమ్మ రాజకీయ ప్రస్థానంలో ప్రశంసలకు పొంగలేదు, విమర్శలకు కుంగలేదు, పాలనా కాలంలో అవినీతి ఆరోపణలపై ప్రత్యర్థులు చేసిన ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వరస తన గెలుపులతోనే. ప్రత్యర్థుల ఆరోపణలకు సమాధానం ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో ప్రోటోకాల్ విషయంలోను ఆమె వివాదాల జోలికి వెళ్లలేదు. రాజకీయ ప్రత్యర్థులు తన పాలన అంశాలలో జోక్యం చేసుకున్న కొన్ని సందర్భాల్లో సమన్వయం పాటిస్తున్నారు తప్పు సమస్యను జటిలం చేయడం లేదు.

వరదల సందర్భంలో గోదావరి తీరంలో అధికార లతో కలిసి అప్రమత్తంగా విధుల్లో దృశ్యం ఫైల్ ఫోటో.


అర్ధాంతంగా వచ్చి పోయే రాజకీయ పదవుల కన్నా , ప్రజల హృదయాల్లో స్థానం పొందడమే గొప్ప పదవి అంటూ సంగి సత్యమ్మ పలు సందర్భాలలో వివరించారు. ప్రజాక్షేత్రంలో వరసగా మూడుసార్లు గెలిచి చైర్ పర్సన్ గా విధుల్లో కొనసాగుతున్న మున్నూరు కాపు ఆడ పడుచు సంగి సత్యమ్మ అభినందనీయురాలు.