ప్రజావాణిలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫిర్యాదు!
J. Surender Kumar,
ధర్మపురి పట్టణంలో ‘ భువన్ ‘ పేరిట పెంచిన 100% ఇంటి పన్నులను తక్షణం రద్దు చేయాలని, 2023 తై బజార్ మార్కెట్ వేలం నిర్వహించవద్దని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
కరీంనగర్, వరంగల్. కార్పొరేషన్లలో లేనివిధంగా ఒకేసారి 10,% నుంచి 100% ఇంటి పనులు పెంచడం దారుణమని పేర్కొన్నారు.
2023 తై బజార్ మార్కెట్ వేలం చట్ట వ్యతిరేకమని, కూరగాయలు పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులపై ఎనలేని ఆర్థిక భారం పడుతుందని తక్షణం వేలం రద్దు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కౌన్సిలర్ లు వేముల నాగలక్ష్మి , జక్కు పద్మ, సంగనభట్ల సంతోషిని, గరిగే అరుణ లు వినతి పత్రంలో పేర్కొన్నారు.