ధర్మపురి మున్సిపల్ సాధారణ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు!

J.SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపల్ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే. హాజరైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంగనభట్ల సంతోషి, జక్కు పద్మ, గరిగే అరుణలు సమావేశాన్ని బహిష్కరించారు.
ఛైర్పర్సన్ సంగి సత్తెమ్మ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం లో. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై ,వైస్ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు ముకుమ్మడిగా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు అని కౌన్సిలర్ ఆరోపణ చేశారు.

గత మూడు రోజుల క్రితం.. మున్సిపల్
కమిషనర్, ఛైర్పర్సన్ ఆధ్వర్యం లో నిర్వహించిన మీటింగ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ను ఎందుకు పిలవలేదు, మహిళ కౌన్సిలర్ల లకు బదులు వారి భర్తలు అధికారిక మీటింగ్ లో ఎలా పాల్గొంటారు అనే అంశాలు పాత్రికేయులకు సమాచారం ఇచ్చినందుకుగాను. చైర్పర్సన్, వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ప్రెస్ వాళ్లకు మీరెందుకు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ల పై ఎదురుదాడి చేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడడంతో నిరసనగా సమావేశాన్ని బహిష్కరించినట్టు వారు వివరించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సంగనబట్ల సంతోషి మాట్లాడుతూ…. ధర్మపురి ప్రజలకు సంబందించిన సమస్యలు త్రాగునీరు ,విధి కుక్కల స్కైర విహారం, రోడ్లపై అవులు వదిలివేసి యజమానులపై చర్యలు, పార్కింగ్, రోజువారి మార్కెట్ కు సంబంధించి పెండింగ్ బకాయిలు (సుమారు 40 లక్షలు) అసాధారణ ఇంటి పన్ను, తైబజర్ రద్దుమిషన్ భగీరథ, కరెంట్ పోల్స్ సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్నన్డుకే …. పరిష్కరించలేక, జవాబు చెప్పలేక ఇలా మహిళ కౌన్సిలర్లని కూడా చూడకుండా దూషణలకు దిగడం సరికాదన్నారు. ఛైర్పర్సన్ సహచర కౌన్సిలర్ల తో మాట్లాడే భాష విధానం నేర్చుకోవాలని హితవు పలికారు. మీరేన్ని దాడులకు దిగిన ప్రజల సమస్యలపై ,ప్రజల పక్షాన పోరాడుతమని ఆమె స్పష్టం చేశారు.