ధర్మపురి నరసింహ స్వామి, జాతర ఉత్సవాలు


మార్చ్ 3 నుంచి 15 వరకు!.

J. Surender Kumar,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఈనెల 3 నుండి ఆరంభం కానున్నాయి. దాదాపు 13 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలు  ఈ నెల 15 న ముగియనున్నాయి. . రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు మహారాష్ట్ర, చత్తీస్గడ్ , కర్ణాటక ,ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తజనం స్వామివారి జాతర ఉత్సవాల లో పాల్గొనడానికి తరలివస్తుంటారు.
ఈ ఉత్సవాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( యోగ, ఉగ్ర) ల తో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, సైతం జాతర ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది .

ఫైర్ ఫోటో


లక్షలాది భక్తజనం తరలి రానున్న ఈ జాతర ఉత్సవాల సందర్భంగా దేవస్థానం అధికారులు ,జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ,భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్ల కోసం ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా శాఖల, అధికారులకు బాధ్యతలను అప్పగించారు. తాగునీటి, వైద్యం, వసతి కల్పన, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు, నిరంతర విద్యుత్తు అన్నదానం, తదితర అంశాలతోపాటు ఆలయ సుందరీకరణ, క్యూలైన్లు ఏర్పాటు, ప్రత్యేక ఆర్టీసీ బస్సు, సౌకర్యాలు తదితర ఏర్పాటు పట్ల ప్రత్యేక కార్యాచరణ యంత్రాంగం సిద్ధం చేసింది. స్థానిక మున్సిపల్ యంత్రాంగం, చైర్ పర్సన్, కౌన్సిలర్లు, పారిశుద్ధ్య పనులను వారం రోజుల ముందు నుంచి ముమ్మరం చేశారు.

ఫైల్ ఫోటో


జాతరలో ప్రధాన ఉత్సవాలు!

3 న కలశ స్థాపన పుట్ట బంగారం,
స్వస్తిశ్రీ  శుభ కృత నామ  సంవత్సరం  పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున అంకురార్పణ ,కలశస్థాపన, వరాహ తీర్ధము, పుట్ట బంగార ఉత్సవం!

4 న సాయంత్రం గోధూళి సుముహూర్తాన , శ్రీ స్వామి వారు ల కళ్యాణం. . (శేషప్ప కళా వేదికపై )

7 న శ్రీ యోగా నరసింహ వారి తెప్పోత్సవం, డోలోత్సవం, ( బ్రహ్మ పుష్కరిణిలో )

8 న శ్రీ ఉగ్ర నరసింహ వారి తెప్పోత్సవము, డోలోత్సవం ( బ్రహ్మ పుష్కరిణి లో )

9 న శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవము, డోలోత్సవం ( బ్రహ్మ పుష్కరిణిలో ).

ఫైల్ ఫోటో

12 న శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం ( క్షేత్ర పురవీధులలో ) జరగనున్న ప్రధాన జాతర ఉత్సవాలు.

ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, గోదావరి నది తీరంలో పోలీస్ పికెటింగ్, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.  ముగ్గురు స్వామివార్లకు పుష్పయాగం,చక్రతీర్థం, ఉత్తర దక్షిణ, దిగ్విజయ యాత్రలు,తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి.

జాతర ఉత్సవాలలో తేదీ 3-03-2023 నుండి 15-03-2023.వరకు శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం, నిత్య నరసింహ హోమము, నిర్వహించబవని ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

ఫైల్ ఫోటో

స్థానిక మున్సిపల్ చైర్పర్సన్  సంగి సత్యమ్మ, కౌన్సిలర్లు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,  ఇందారపు రామయ్య, గందే పద్మ, అక్కల పెళ్లి సురేందర్, వీర వేణి కొమురయ్య, చుక్క రవి, స్తంభంకాడి మహేష్,  ఇనగంటి రమాదేవి, గునిశెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేష్,  వేముల నరేష్, జైన రాజమౌళి, సంగం సురేష్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, జాతర ఉత్సవాలలో భక్తజనం కు సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నారు.