ధర్మపురి శ్రీ నరసింహ స్వామి జాతరా లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు!

జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !

J. Surender Kumar,

15 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో భక్తజనంకు ఎలాంటి అసౌకర్యాలు  కలుగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సేవలందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.

శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా TTD ధర్మశాలలో బుధవారం   కలెక్టర్  అధ్యక్షతన అన్నిశాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై వివిధ అంశములపై రెండవసారి సమీక్షించి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు
జాతర జరగ నున్న  స్థలాల ను ఆమె పరిశీలించారు


సమీక్ష సమావేశంలో
ఎస్పీ భాస్కర్,   అడిషనల్ కలెక్టర్ T.మకరందు  మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ T. వినోద్ కుమార్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య ,మరియు ధర్మకర్తలు
దేవాదాయశాఖ జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్  , దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్,   మరియు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.


స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ !


కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష,
అడిషనల్ కలెక్టర్  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న తదుపరి అర్చకులు ఆశీర్వచనం  తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, కలెక్టర్ కు స్వామివారి,   శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి  సన్మానించారు.