ధర్మపురి నరసింహుడి కళ్యాణానికి పోటెత్తిన భక్తజనం!

ఆలయ ప్రాంగణంలో అడుగు వేసి అడుగు తీయలేని దుస్థితి !

J. SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చిన భక్తజనంతో ధర్మపురి క్షేత్రం శనివారం పోటెత్తింది.


ఆలయ ప్రాంగణంలోని యోగ, యమ ధర్మరాజు, వెంకటేశ్వర స్వామి, కొత్త నరసింహ స్వామి, వేణుగోపాలస్వామి, ఆలయ ప్రాంగణాలు, పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడింది.

కిక్కిరిసిన భక్త జనంలో చిక్కుకున్న ఓ భక్తురాలి చేతిలో ఉన్న పాపను సెక్యూరిటీ గార్డ్ ఎత్తుకొని మహిళను క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు.

కలెక్టర్ చోరువ తో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు!

ఆలయ ప్రాంగణంలోనే రెండు ఎల్ఈడి డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేయడంతో అందులో స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించారు. ఆలయం ముందు శిఖరం ప్రధాన కూడళ్లు ఇసుక స్తంభం . నంది విగ్రహం , గోదావరి తీరంలో డిజిటల్ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు

. క్షేత్రంలో సిటీ కేబుల్ ద్వారా ప్రత్యేక ప్రసారం చేశారు.


పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీమతి కొప్పుల స్నేహలత, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంఘీ సత్యమ్మ, కమిషనర్ రమేష్, స్వామివారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు, మంగళ వాయిద్యాలు మేళా తాళాలతో ఊరేగింపు తీసుకొచ్చారు

. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు, ఇసుక స్తంభా కూడలి నుంచి ఎర్ర తివాచీ పరచి స్వాగతించారు. ఎస్పి భాస్కర్, తదితర ప్రముఖులు స్వామివారి కళ్యాణ మహోత్సవము తిలకించారు.

ప్రముఖ ప్రవచకుడు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ , స్వామి వారి కళ్యాణ ఘట్టాలను భక్తజనంకు అర్థమయ్యేలా చేసిన వ్యాఖ్యానాలు భక్తులను ఆకట్టుకుంది.

.