ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర ఆదాయం ₹ 88 లక్షలు!

J. Surender Kumar,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవాలలో మొత్తం ఆదాయం ₹ 88,28,114/-
(ఏనుబది యెనిమిది లక్షల 28 వేల, 114/-) వచ్చిందిఇందులో శుక్రవారం ఉండి లెక్కించగా (24 రోజుల) ₹ 33, 21, 874/- రాగ 8 కిలోల 100 గ్రాముల మిశ్రమా వెండి, 53-600 గ్రాముల మిశ్రమ బంగారం, 20 విదేశీ నోట్లు హుండీలో లభించాయి.
జాతర ఉత్సవాలలో 13 రోజులలో వివిధ రకాల టికెట్ల అమ్మకాల ద్వారా ₹ 24,16,211/-. ప్రసాదాల విక్రయం ద్వారా ₹ 23,35,525/- అన్నదానం విరాళాల ద్వారా, ₹ 7,54,504/- వచ్చినట్టు E.O. శ్రీనివాస్ తెలిపారు.

నరసింహుని దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్!

శుక్రవారం దేవస్థానమునకు ధర్మపురి క్షేత్ర వాసులైన ప్రముఖ సినీ దర్శకులు హరీష్ శంకర్ దంపతులు దర్శనం చేసుకున్నారు, అనంతరం దేవస్థాన అర్చకులు,వేదపండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఈఓ శ్రీనివాస్ శేష వస్త్ర ప్రసాదం, ఫోటో ఇవ్వనైనది, వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, E.O శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.