J. SURENDER KUMAR,
అనారోగ్యంతో ఆస్పత్రులలో వైద్యం చేయించుకుంటూ ఆస్పత్రి ఫీజులు చెల్లించలేనీ ఆర్థిక ఇబ్బందులలో ఉండి అవస్థ పడేవారి, బంధుమిత్రులకు , గుర్తుకు వచ్చేది గొల్లపల్లి గణేష్ సార్, ఆర్థికంగా ఆదుకుంటాడని నమ్మకం వారిది,
ఆశించిన ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడే విద్యార్థుల. ఆశా దీపం గణేష్ సార్, కాళ్లకు చెప్పు లేక, రాయడానికి నోట్ బుక్స్ ,స్కూల్ బ్యాగ్స్ కొనుగోలు శక్తి లేని బుడిబుడి అడుగుల విద్యార్థుల పాలిట కామదేనువు గణేష్ సార్,
గోదావరి వరదలు కరోనా, తదితరసందర్భాలలో గణేష్ సార్, ఆయన మిత్ర బృందం అందించిన, అందిస్తున్న, అందించనున్న సహాయ సహకారాలు సమాజానికి తెలియాల్సి ఉంది, తేలపాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆయనను ఆయన మిత్ర బృందం ను. అభినందిస్తూ, ప్రోత్సహించాల్సిన బాధ్యత సభ్య సమాజం పై ఉందని భావించాల్సి ఉంటుంది..

ఈ ఉదంతాలు, ఎందుకంటే. ఉపాధ్యాయ వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు వాటిని అధిగమిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందడం ప్రత్యేకత కాకున్నా, గణేష్ పట్టుదలను ప్రశంసించాల్సిందే.
ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ గొల్లపల్లి గణేష్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఉస్మానియా తెలుగు శాఖ నుండి
”అంతర్జాలంలో తెలుగు భాషాసాహిత్యాల
అధ్యయనం ” అనే అంశంపై పరిశోధనకు గాన
డాక్టరేట్ ప్రదానం చేసారు.

డాక్టర్ గొల్లపల్లి గణేష్ గూర్చి…

ధర్మపురి లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం. డిగ్రీలో అత్యుత్తమ మార్కులకు గాను 2003 సంవత్సరానికి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

2008 డియస్సీ ద్వారా తెలుగు భాష పండితునిగా ప్రస్తుతం ధర్మపురి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉద్యోగం. ఉపాధ్యాయునిగా సేవలకు గాను 2021 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
సామాజిక సేవ కార్యక్రమాల్లో..

సోదరుడు పవన్ కుమార్ స్ఫూర్తితో 2016 సంవత్సరంలో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించే ఉద్దేశ్యంతో * విద్యార్థి దత్తత కార్యక్రమం * (Student Adoption Program) ఏర్పాటు చేశాడు. గత 7 సంవత్సరాల్లో ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, బీర్‌పూర్ మండలాల్లోని సుమారు 2500 మంది నిరుపేద విద్యార్థులకు ₹15 లక్షల పైగా విలువ గల, సంవత్సరానికి సరిపడే స్టేషనరీ సామాగ్రి (బ్యాగు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిల్‌లు తదితర) అందించారు.

ఉన్నత విద్య కోసం చేయుత!
ఇదే కార్యక్రమంలో భాగంగా 6 గురు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కొరకు దాతల సహకారంతో ఆర్థిక తోడ్పాటు అందించారు. ముగ్గురు విద్యార్థులు బిటెక్ చదువుతుండగా, ఒక విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటిలో, మరో విద్యార్థిని కరీంనగర్ లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు. రాయపట్నంకు చెందిన ఒక విద్యార్థిని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేశాడు.
వుయ్ హెల్ప్ యు !

చిన్ననాటి మిత్రులతో వుయ్ హెల్ప్ యు అనే సంస్థ 2012లో . ఏర్పాటు చేశాడు,
దీని ద్వారా ఆరోగ్యం, విద్య కు సంబంధించిన అవసరాలు ఉన్న వారికి ఆర్థిక సహాయం, ఉన్నత చదువుల కొరకు తోడ్పాటు అందిస్తున్నారు.
దాదాపు 42 మందికి సుమారు ₹15 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించారు.

కరోనా కష్టకాలంలో దాతల సహకారంతో సుమారు 300 నిరుపేద కుటుంబాలకు ₹1000 విలువ గలిగిన నిత్యావసర సామగ్రి కిట్ల పంపిణీ. ప్రజల అవసరార్థం ” మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ” మిషిన్ ల కొనుగోలు చేశారు.
ధర్మపురిలో వరదలలో దెబ్బతిన్న సుమారు 380 కుటుంబాలకు దాతల సహకారంతో ₹4 లక్షల విలువైన దుప్పట్లు, చాపల పంపిణీ చేశారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలలో , విద్యాబోధనలో బిజీగా ఉంటూ పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం. అభినందనీయమే.