గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలు!

జిల్లా కలెక్టర్ షేక్ యాసిన్ భాష!

J.SURENDER KUMAR,

గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం మరియు పి.సి&పి.ఎన్.డి. టి. ఆక్ట్ అమల గూర్చి జిల్లా ఉన్నత స్థాయి మల్టీ మెంబర్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష మరియు మరియు జిల్లా జడ్జి నీలిమ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ సమావేశం మందిరంలో జరిగింది. గర్భస్థ లింగ నిర్ధారణ ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

స్త్రీ, పురుష నిష్పత్తి జిల్లలోని కొన్ని మండలాలలో తక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీన్ని పెంచడానికి గ్రామస్థాయిలో ఆవగాహన శిభిరాలు నిర్వహించాల్సిందిగా వైద్య శాఖను ఆదేశించారు.
ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనికీలు చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకమైన టీంలను ఏర్పాటు చేయాలని, ప్రతీ అబర్సన్ కేసు పై విస్త్రుతమైన చర్చ జరుగాలని, ఇందులో ఆశ, అంగన్వాడి, స్వశక్తి సంఘ మహిళల సహకారం తీసుకోవాలని, ఎవరైనా లింగ నిర్దాణ నిర్వహించినచో వారికి జరిమానా విదించడంతోపాటు, జైలు శిక్ష, వారి రిజిస్త్రేసన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.


జిల్లలో సిజేరిన్ సెక్షన్స్ 87 శాతం జరుగుతున్నవని, వాటిని తగ్గించాలని, సాదారణ ప్రసవాల ప్రాముఖ్యత గూర్చి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాద్యత ముఖ్యంగా వైద్యులపై వుందని, ఒకవేళ ఎవరైనా ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ ప్రోస్తహించినచొ వారి పై చర్యలు తప్పవని హేచ్చరించారు.
ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. శ్రీధర్, ఉపవైద్యాధికారి డా. యన్. శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డా. సమియుద్దిన్, డా. ఎ. శ్రీనివాస్, డా. జైపాల్ రెడ్డి, డి.పి.ఓ. స్వామీ, ఇంచర్గే డెమో టి. రమణ, హెచ్.ఇ. కె. భూమేశ్వర్ పాల్గొన్నారు.