గ్రూప్​-1 లో 121 మందికి 100 మార్కులు – ముగ్గురు ఉద్యోగులు అరెస్టు ?

J. Surender Kumar,

గ్రూప్​-1లో 121 మంది విద్యార్థులకు 100 మార్కులు వచ్చినట్లు సిట్​ దర్యాప్తులో తేలింది. ఆరురోజుల కస్టడీలో భాగంగా 9 మంది నిందితులను విచారిస్తున్న సిట్. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీలో సిట్​ దూకుడు పెంచింది. . పలు కీలక విషయాలను సేకరించింది. ఈ కేసుతో సంబంధమున్న ముగ్గురు టీఎస్​పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసిన సమాచారం. మరోవైపు కమిషన్​లోని 40మంది ఉద్యోగులకు సిట్​ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీలో కోచింగ్ సెంటర్లకు కూడా సంబంధముందని అనుమానిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం. రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
విచారణలోపలు కీలక ఆధారాలను సిట్ రాబట్టింది. రేణుక, డాక్యానాయక్​ కాల్​ డేటాను పరిశీలించగా, అభ్యర్థులు, కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులతో మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. కమిషన్​లోని 10 మందితో పాటు, మరో 40 మంది సభ్యులకు సిట్​ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోచింగ్​ సెంటర్​ నిర్వాహకులకు, అభ్యర్థులకు కూడా నోటీసులు ఇచ్చే యోచనలో సిట్​ ఉన్నదని సమాచారం.
టీఎస్‌పీఎస్‌సీ నుంచి 20 మంది పరీక్ష రాస్తే.. అందులో ఇద్దరికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్​ అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి రమేష్‌కు, మహిళా ఉద్యోగినికి సైతం 100కు పైగా వచ్చినట్లు సిట్​ అధికారుల వద్ద కచ్చితంగా సమాచారం ఉంది. ఈ ఆధారాలతో కమిషన్​లోని రమేష్​, షమీమ్, సురేష్​​లను నిందితులుగా చేర్చి.. వీరిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని గురువారం కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం
ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్​కు.. టీఎస్​పీఎస్సీ కమిషన్​లో 20 మందికిగానూ, 8 మంది మెయిన్స్​కు అర్హత సాధించినట్లు గుర్తించారు. ఈ ముగ్గురి చేరికతో ప్రశ్నాపత్నం లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరుకుంది.