జగిత్యాల జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు !
హాజరుకానున్న 15972 మంది విద్యార్థులు!
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !
J.SURENDER KUMAR,
విద్యార్థులు ప్రైవేట్ కళాశాల నుండి హాల్ టికెట్ పొందడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే TSBIE వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొవాలి, హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రంలోికి అనుమతిస్తారు. అంటూ జగిత్యాల్ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రత్యేకంగా ఫీజులలు, అటెండెన్స్ పేరిట విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జగిత్యాల జిల్లాలో 29 ఇంటర్ పరీక్షా కేంద్రాలలో
15 ప్రభుత్వ ,1 మోడల్ స్కూల్, 13 ప్రైవేట్ జూనియర్ కళాశాలలలో పరీక్షా కేంద్రాలలో 15972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
అన్ని పరీక్షా కేంద్రాలలో ఫర్నిచర్ మంచినీటి సౌకర్యము మరియు వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, ఉదయం 6 గంటల నుంచి వారి వారి పరీక్షా కేంద్రాలకు రావడానికి టిఎస్ఆర్టిసి వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో చేరుకోవాలని, విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుండి పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు

విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు గాని మొబైల్ ఫోన్ గాని పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదు విద్యార్థులు ఎవరైనా పరీక్షలు అంటే భయం ఉన్నట్లయితే టెలి మానస్ హెల్ప్ లైన్ నెంబర్ 14416 కు ఫోన్ చేసి మానసిక వైద్యుల నుండి సూచనలు సలహాలు పొందవచ్చును ఈ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

ఒక్క నిమిషం ఆలస్యం గా వచ్చిన అనుమతి ఉండదని విద్యార్థులకు అవగాహన కల్పించామని, అన్నీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని , మాస్ కాపింగ్ జరగకుండా సిట్టింగ్ స్కాడ్ ఏర్పాటు..
ఇందు కోసం టోల్ ఫ్రీ నెంబర్…1800 4257620 ఏర్పాటు