J. SURENDER KUMAR,
అపర భద్రాచలంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి బుధవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పక్షాన, ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు.
శ్రీరామ నవమి కల్యాణోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలో సాంప్రదాయం మేరకు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి, సంకటాల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , పల్లెర్ల సురేందర్, వేముల నరేష్, ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, వీరవేణి కొమురయ్య, చుక్క రవి, అక్కనపల్లి సురేందర్ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కమిటీ కాల పరిమితి మరో ఆరు మాసాలు!

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల పదవి కాలాన్ని దేవాదాయశాఖ కమిషనర్ మరో ఆరు నెలల కాల పరిమితి పొడిగిస్తూ ఈనెల 28న లేఖ సంఖ్య 7223/ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.