మద్దతు తెలిపిన జగిత్యాల జిల్లా డిసిసి లక్ష్మణ్ కుమార్!
కరీంనగర్ రాయపట్నం రహదారి దిగ్బంధం!
పోలీసులకు గ్రామస్థులకు మధ్య వాగ్వివాదం!
J. Surender Kumar,
ఇథనాల్ ప్రాజెక్ట్ మాకు వద్దు అంటూ ప్రాజెక్ట్ కి వ్యతరేకంగా పాశిగామ గ్రామనికి చెందిన గ్రామస్థులు, మహిళలు శుక్రవారం రోజున పురుగుల మందు డబ్బాలను పట్టుకొని రోడ్డు పై బైఠాయించి మంత్రి కొప్పుల ఈశ్వర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం లో జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని గ్రామస్థులకు మద్దతు తెలిపారు. ఆయనతోపాటు వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలెందర్ రెడ్డి, వెల్గటూర్ గ్రామ సర్పంచ్ మెరుగు మురళి, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేని మొగిలి నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ఎటువంటి గ్రామ సభ పెట్టకుండా గ్రామస్థుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఫ్యాక్టరీ నీ ఎలా పెడతారని, ఇటువంటి ఫ్యాక్టరీనీ పెట్టేముందు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో గ్రామలలో సదస్సు పెట్టీ గ్రామ ప్రజలు ఒప్పుకున్న తర్వాత నే ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని, లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంత్రి హోదాలో ఉండి గ్రామస్థులకు తెలియకుండా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫ్యాక్టరీ పనులకు భూమి పూజ చెయ్యవలసిన అవసరం ఏముందని?

ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు నష్టం వాటిల్లితుందని ఇక్కడి గ్రామ ప్రజల ప్రాణాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్, చెలగాటం ఆడుతున్నారని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. వెంటనే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో గ్రామసభల నిర్వహించి, రైతాంగం, గ్రామస్తుల అనుమతీస్తే నే ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు…

ఈ సందర్భంగా పోలీసులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ అరెస్టు చేసి వాహనం లో తీసుకెళ్తుండగా గ్రామస్థులు ,మహిళలు వాహనానికి అడ్డుగా కూర్చొని ముందుకు వెళ్లకుండా అడ్డుకొని పోలీసులకు మరియు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ నేథ్యంలో వాహనానికి అడ్డుగ ఉన్న గ్రామస్థులపై ,మహిళల పైన లాఠీ చార్జి చేసి పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టి వేయడం కొంత మంది మహిళలలు గాయపడ్డారు, ఈ క్రమంలో పోలీసులతో మహిళలు వాగ్విదానికి దిగారు.. ఈ సందర్భంగా అడ్లురి లక్ష్మణ్ కుమార్ సారంగాపూర్ స్టేషన్ కి తరలించి నిర్బంధించారు.., అదే విధంగా వెల్గటుర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ మురళి ని, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేని మొగిలినీ కాంగ్రెస్ శ్రేణులను గొల్లపెల్లి స్టేషన్ కి స్టేషన్ కి తరలించారు .