J. Surender Kumar,
కలెక్టర్ షేక్ యాసిన్ భాష, అదనపు కలెక్టర్ మంద మకరందం, మంగళవారం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఆమె పరిశీలిస్తూ సుడిగాలి పర్యటన చేపట్టారు.

కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో సందర్శించారు పెండింగ్లో ఉన్న పనులను ఈనెల 31 వరకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.

జగిత్యాల పట్టణం గాంధీ నగర్ లో ఆరోగ్య మహిళా క్లినిక్ సెంటర్ ను సందర్శించారు.ప్రతి మహిళ యొక్క ఆరోగ్య మహిళ క్లినిక్ ను వినియోగించుకోవాలని అన్నారు.
కథలాపూర్ మండలంలో భూషణ్రావుపేట్ గ్రామంలో కంటి వెలుగు సెంటర్ ను పరిశీలించారు. ఆర్డీవో కోరుట్ల వినోద్ కుమార్ సర్పంచ్ ఎంపీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కోరుట్ల పట్టణంలో మున్సిపల్ అర్బన్ 9.వార్డ్ కంటి వెలుగు సెంటర్ సందర్శించారు.

పట్టణ ప్రగతి నర్సరీ కోరుట్ల మండలంలో సందర్శించిన జిల్లా కలెక్టర్ మొక్కలను పరిశీలించి ప్రతి ఒక్క మొక్క కాపాడుకోవాలని, నీటి వసతి మొక్కలకు ఎండ తగలకుండా పైన గ్రీన్ మ్యాట్ వేసుకొని కాపాడాలని ఆదేశించారు.