J.SURENDER KUMAR,
టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీని నిరసిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి., ఈ సందర్భంగా స్థానిక ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసిల్ చౌరస్తా వరకు తరలి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కెసిఆర్ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేస్తూ సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టెందుకు సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు తటిపర్తి దేవేందర్ రెడ్డి, కొండ్ర జగన్,పుప్పాల అశోక్, కౌన్సిలర్ నక్క జీవన్, మాజీ కౌన్సిలర్ గాజుల,రమేష్ రావు, కోర్టు శ్రీను, వీర బత్తిని శ్రీనివాస్, మున్నా, కమల్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అద్యక్షుడు ధర రమేష్ బాబు, కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మన్సూర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నే హాల్, శేఖర్ పాల్గొన్నారు.