10న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాక!
J. SURENDER KUMAR,
ఈనెల 10న జగిత్యాల జిల్లాలో టి.పి.సి.సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాద యాత్ర విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ కోరారు.
బుధవారం ధర్మపురిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
ఈనెల10 న జగిత్యాలకు విచ్చేసి శాసన మండలి సభ్యులు శ్రీ టి.జీవన్ రెడ్డి తో కలిసి సాయంత్రం 4.00 గంటల నుండి జగిత్యాల మండలంలోని చల్ గల్ గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరి గాంధీ నగర్,.మంచినీళ్ళబావి, తీన్ ఖని చౌరస్తా, టవర్ సర్కిల్ మీదుగా కొత్త బస్టాండ్ సర్కిల్ వరకు పాదయాత్రను పూర్తి చేసుకొని అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందని లక్ష్మణ్ కుమార్ వివరించారు.
.ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన బట్ల దినేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహ రాజు ప్రసాద్, (జైన ఎంపిటిసి) బ్లాక్ కాంగ్రెస్1 అద్యక్షులు కుంట సుధాకర్, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపధ్యక్షులు వేముల రాజేష్, NSUI టౌన్ ప్రెసిడెంట్ శ్రవణ్, రఫియోద్దిన్, సిపతి సత్యనారాయణ, నల్ల శ్రీహరి, కొస్న బుచ్చిరెడ్డి, బాల గౌడ్, పురంశెట్టి మల్లేశం,స్తంభంకాడి గణేష్, దూడ లక్ష్మణ్, రజినీకాంత్, ప్రశాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు