జగిత్యాల లో నూతన డయాలసిస్ యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ !

J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణం లోని స్థానిక ATM హాస్పిటల్ లో నూతనముగా డయాలసిస్ యూనిట్ ను రిబ్బన్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్.రమణ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ లు
ఎమ్మెల్యే మాట్లాడుతూ

డయాలసిస్ పేషంట్లను ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ను రాష్ట్రం ప్రభుత్వం ఉచితంగా నిర్వహించడం మంచి కార్యక్రమం, రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లు సుమారుగా 500 వరకు ఉన్నాయి దీని ద్వారా ఎంతోమంది కిడ్నీ వ్యాధి గ్రస్తులకు లబ్ధి చేకూర్స్తుందని అన్నారు.

ఎమ్మెల్సీ మాట్లాడుతూ
డయాలసిస్ యూనిట్ ని పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ను జగిత్యాల ప్రజానీకం వినియోగించుకోవాల్సిందిగా కోరడానికి.
చైర్మన్ మాట్లాడుతూ


ప్రస్తుతం ఏటీఎం హాస్పిటల్ లో 30 మంది డాలర్స్ పేషెంట్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది, వీరందరూ జగిత్యాల జిల్లా చుట్టుపక్కల గ్రామస్తులు,
రోజువారీగా 16 మంది డయాలసిస్ పేషెంట్లను ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది,
కార్యక్రమంలో భాగంగా డయాలసిస్ పేషంట్లకు హాస్పిటల్లో పండ్లు పంపకం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గార్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
అలాగే హాస్పిటల్ లో 36 మంది సిబ్బందిని గౌరవంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ శాలువాలతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ముస్కు నారాయణ రెడ్డి, శివ కేసరి బాబు , పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, మాజీ కౌన్సిలర్లు, అడ్వకేట్ భూసారపు శ్రీనివాస్ గౌడ్, దుమల రాజకుమార్, బిక్షపతి, సమిండ్ల శ్రీనివాస్, నరేష్, నర్సయ్య, మనాల కిషన్, కొత్త కొండ అంజయ్య, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.