జగిత్యాల మానస స్కూల్ ఎక్స్లెన్స్ లో అలరించిన ‘ చిరియో బాష్ పార్టీ 2023 !


J.SURENDER KUMAR,


జిల్లా కేంద్రం లోని మానస ఎక్స్లెన్స్ స్కూల్ అధ్వర్యంలో స్థానిక వాసవి గార్డెన్స్ లో 9 వ తరగతి విద్యార్థులచే 10 వ తరగతి విద్యార్థులకు  “చిరియో బాష్ పార్టీ 2023” పేరుతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమం అంగరంగ వైభవంగా కనులవిందుగా జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ రజిత రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొదటగా పదవ తరగతి విద్యార్థులకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ ఏ.శ్రీనివాస్, హైదరాబాద్ గారిచే విద్యార్థులకు బోర్డు పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి కి గురి కాకుండా  ఎవిధంగా  విజయం సాధించాలో,ఉత్తమ ఫలితాలు సాధంచుటకు  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

అనంతరం 9వ తరగతి  విద్యార్థులచే పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సరదా ఆటలు ,పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా  విద్యార్థులు పాఠశాలతో గల అనుబంధాన్ని,తీపి గుర్తులను, జ్ఞాపకాలను తోటి విద్యార్థులతో పంచుకోవటం  జరిగింది.ఉదయం నుండి సాయంత్రం వరకు అధ్యంతం అంగరంగా వైభవంగా జరిగాయి


జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ లో


పట్టణం లోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ లో SPARKLE…  పేరిట పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నీ పాఠశాల డైరెక్టర్ శ్రీ బీయ్యల హరిచరన్ రావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విద్యార్ధులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఒడి దుడుకులు ఎదిర్కొనీ, మనో స్థైర్యాన్ని నింపే విధంగా మరియు పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు, వారిలో ఆత్మ విశ్వాసం నింపేందుకు సైకాలజిస్ట్ శ్రీ అడిగేల శ్రీనివాస్ చే మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు , నాటికలు చూపరులను ఆకట్టుకున్నాయి. ” నాన్న ప్రేమ ” మీద వేసిన నాటిక చూపరాలను ఆలోచింప చేసింది. అదే విధంగా వేడుక కి హాజరైన తల్లి దండ్రులు కి ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారు. పదవ తరగతి విద్యార్థులు నర్సరీ నుండి తమకి విద్యా బుద్దులు నేర్పిన గురువులకు గురు దక్షణ గా బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీ బియ్యల హారి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత రావు,సుమన్ రావు, రజిత , పాల్గొన్నారు.