జగిత్యాల మున్సిపల్ ఎజెండాపై కలెక్టర్ కు ఫిర్యాదు!

కౌన్సిలర్ జయశ్రీ ..

J.Surender Kumar,

జగిత్యాల మున్సిపల్ సాదారణ సమావేశం గురువారం ఇంచార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన  జరిగింది. ఎజెండాలో పొందు పర్చిన అంశాలపైన కౌన్సిలర్  జయశ్రీ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అంశంలోని వివరాలు ఇలా ఉన్నాయి
!

1. ఆదాయ, వ్యయాలకు సంబందించి నవంబర్ To జనవరి మూడు మాసాలకు సంబందించి నెల వారిగా కాకుండా 3 మాసాలకు సంబంధిచి ఒకే మొత్తంగా చూపడం నిబంధనలకు నిరుద్ధం దీనిపైన.
2. సెంట్రల్ మీడియన్ కు  మొక్కలు (12 కర్జూర చెట్లు) మరియు మిగిలిన మొక్కలు నర్సరీ నుండి పెట్టిన వాటి ఖర్చు 6, 05, 129/- మరియు రవాణాకు ట్రాక్టర్ కిరాయి పేరు మీద 2,29,554/- ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం దీని పైన.
3. చెట్లకు కలర్స్ పేరిట కేవలం సున్నం వెసి దాదాపు 20లక్షల రూ,,చెల్లించారు దీనిపైన.
4. స్వీపింగ్ మిషన్ అనేది అధికారులకు ఆదాయ వనరుగా మారింది 45 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి రిపేర్ల పేర్ల మీద లక్షల రూ,, ఖర్చు చూపుతూ పనికిరాని దాని పేరు మీద ప్రజాదనాన్ని దుర్వినినయోగం చేస్తున్నా అధికారులపైన.
5. సానిటీషన్ విభాగంలో రిపేర్ల పేర్ల మీద ఈ సెక్షన్ ఇది వరకే డీజిల్ అక్రమాలు మొదలగు ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తున్న ఉన్నత అధికారులు కూడా దానిలో పని చేస్తున్నా సిబ్బందిని మార్చకుండా వారికే పండగలకు సంభందించిన కార్యక్రమాల బాధ్యతను అప్పగించి వారినే ప్రోస్తహిస్తున్న సందర్భంగా ఈ అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.
6. మున్సిపల్ పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో కలెక్టర్ గారి అధ్యర్యంలో జరగాల్సిన నియామకాలు సానిటేషన్ లెబర్లు గానీ, ఆపరేటర్లు గాని, సిబ్బంది కానీ క్రొత్త వారు రావటం జరుగుతుంది. ఈ అంశాల పై సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదు లో పేర్కొన్నరు