J. Surender Kumar,
శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారి ఆలయం ప్రాంగణంలోగల శ్రీ శేషప్ప కళావేదికపై శ్రీ స్వామివారల నిత్యకళ్యాణంతో పాటు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం దేవస్థానం వేదపండితులు అర్చకులచే అంగరంగ వైభవం జరిగింది.

తాడూరి వారి రామాలయానికి తలంబ్రాలు!

ధర్మపురి గోదావరి నది తీరం సమీపన గల శ్రీ రామాలయముకు ధర్మపురి ,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పక్షాన స్వామి వార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , పల్లెర్ల సురేందర్, వేముల నరేష్, ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, వీరవేణి కొమురయ్య, చుక్క రవి , అక్కనపల్లి సురేందర్ , స్థంభంకాడి మహేష్ , గందె పద్మ శ్రీనివాస్ , గునిశెట్టి రవీందర్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు ,సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి పాల్గొన్నారు