కార్యకర్తలు ముఖ్యనేతలే పార్టీ కి పట్టుకొమ్మలు!

జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో..

మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు !

J.SURENDER KUMAR,

కార్యకర్తలు, ముఖ్య నేతలే బీ ఆర్ ఎస్ పార్టీకి పట్టుకొమ్ములు అని, విపక్షాలు చేసే కుట్రలను తిప్పి కొట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు నిచ్చారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి, పోలీస్ హోసింగ్ కమిటీ చైర్మన్ కోలేటి దామోదర్, ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు అధ్యక్షతన శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.


రానున్న ఎన్నికలకు సమయాత్తం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. పార్టీ బలోపేతం పై ద్రుష్టి సారించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, విజయం సాధించాం అన్నారు. ఉద్యమ పార్టీకి ప్రజలు రెండు సార్లు అధికారం అప్పగించారని చెప్పారు. లక్షల మంది జై తెలంగాణ నినాదం తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. పదవుల కోసం అవకాశాలు వస్తాయని, పార్టీ అభి వృద్ధి కి పాటు పడాలని సూచించారు.


తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కొప్పుల చెప్పారు. ప్రతీ కార్యకర్తను కదిలిస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో వివరించాలన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.
అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. పార్టీ అనేది లింక్ లాంటిదాన్నారు. ఎమ్మెల్యే గెలిస్తేనే సర్పంచ్ గెలుస్తారు అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలనే తాను చెబుతున్నానని అన్నారు.
కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. యావత్ దేశం
కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని చెప్పారు. బాధ్యత తో గ్రామాల్లో పర్యటించాలన్నారు. పార్టీ బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందాన్నారు. ఏ సర్వే చుసిన బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నాయని చెప్పారు. కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. నాయకుల పాత్ర చాలా కీలకం,ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. కాంగ్రెస్, బిజెపి లను తిప్పి కొట్టె దమ్ము ధైర్యం ఒక్క బిఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. ఒక్క అబద్దం వందసార్లు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని.. వీటిని తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.


ఈ సమావేశంలో జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్,‌ రవి శంకర్, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, ఫైనాన్స్ చైర్మన్ రాజేశం గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్ది, జితేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.