ఖాతాదారుడి సొమ్మును బ్యాంక్ వడ్డీతో సహా చెల్లించాలి!

యూనియన్ బ్యాంక్ కు ఫోరం ఆదేశం!

J.Surender Kumar,

బ్యాంకు నిర్లక్ష్యంతో ఖాతాదారుడి లక్షలాది రూపాయల డబ్బులు మరో వ్యక్తి  డ్రా చేసుకున్నాడని. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత  బ్యాంక్ బాధ్యత వహించి ఖాతాదారుడికి లక్షలాది రూపాయల డబ్బులను  వడ్డీతో సహా చెల్లించాలని కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి కే. స్వరూపారాణి, సభ్యులు ఎస్. శ్రీలత, వి నరసింహారావులు. ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల పట్టణానికి చెందిన సిద్ధం రాజశేఖర్, 2014 సంవత్సరంలో, సాయి దుర్గ వైన్స్ పేరిట పట్టణంలోని యూనియన్ బ్యాంకు లో అకౌంటు తెరిచారు. వ్యాపార లావాదేవీలు పర్యవేక్షణ నిమిత్తం. తిరుపతి గౌడ్ అనే వ్యక్తికి బ్యాంకు లావాదేవీల నిర్వహణకు చెక్ పవర్ ఇవ్వాల్సిందిగా బ్యాంకు రాజశేఖర్ లేఖ రాశారు. ఈ మేరకు తిరుపతి గౌడ్  అట్టి ఖాతాలో లావాదేవీలు కొనసాగిస్తున్నారు.
వ్యాపారం ముగియడంతో. తిరుపతి గౌడ్ చెక్కులను పరిగణంలోకి తీసుకోవద్దని బ్యాంకు లావాదేవీలతో అతడికి ఎలాంటి సంబంధం లేదని ఖాతాదారుడు సిద్ధం రాజశేఖర్ బ్యాంక్ మేనేజర్ కు లిఖితపూర్వకంగా లేఖ అందించారు.
తమకు  ఇదే అంశంలో   అఫిడట్ రూపంలో అందించాలని మేనేజర్ వివరించారు. బ్యాంకు వారు కోరిన విధంగానే  తిరుపతి గౌడ్ కు ఏ అకౌంటుకు ఎలాంటి సంబంధం లేదంటూ రిజిస్టర్ పోస్టు ద్వారా ఖాతా దారుడు బ్యాంకు వారు కోరిన డాక్యుమెంట్లను అందించి రసీదు పొందాడు.
ఈ లోగా ఖాతాదారుడు రాజశేఖర్ కు సంబంధించి ఇన్ కమ్. టాక్స్ రిటర్న్స్ ఇన్సెంటివ్ ₹ 2,30,610/- ( 2 లక్షల 30 వేల 620/-) ఖాతాలో జమ చేశారు. రాజశేఖర్ ఖాతాలో ఉన్న ఈ డబ్బులను తిరుపతి గౌడ్ డ్రా చేసుకున్నాడు. దీంతో ఖాతాదారుడు రాజశేఖర్ బ్యాంకు, మేనేజర్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన, వారు నిర్లక్ష్యంగా సమాధానాలు, మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు మీరు తేల్చుకోండి అని ఖాతాదారునికి స్పష్టం చేశారు. రాజశేఖర్ తనకు జరిగిన అన్యాయం గురించి ప్రముఖ న్యాయవాది
మెట్ట మహేందర్  ద్వారా ఫోరమ్ ను ఆశ్రయించారు.
బ్యాంకులో రాజశేఖర్ డబ్బులు ఇతరులు డ్రా చేసిన తేదీ నుంచి.₹  2, 28,000/- ( రెండు లక్షల 28 వేల రూపాయలు) 9% వడ్డీతో కలిపి బ్యాంకు ఖాతాదారుడు సిద్ధం రాజశేఖర్ కు చెల్లించాలని,  ఖర్చుల నిమిత్తం., మరో ₹ 5,000/- చెల్లించాలని. ఫిబ్రవరి చివరి వారంలో బ్యాంకు మేనేజర్ కు ఆదేశాలు జారీ చేశారు.