ఎమ్మెల్యే సుంకే రవిశంకర్!
J.Surender Kumar,
అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి అలారమ్ మిషన్ ను ఏర్పాటు చేయండి అంటూ చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, కార్యనిర్వహణాధికారి ని ఆదేశించారు.
మంగళవారం ఎమ్మెల్యే కొండగట్టు ఆలయ అధికారులు సిబ్బంది అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కేటాయించిన ₹100 కోట్లు నిధుల వినియోగం, సిద్ధం చేసిన పనుల కార్యాచరణ ప్రణాళిక వివరాలను ఆయన అధికారులతో విశ్లేషించారు.

ఆలయంలో శుక్రవారం దొంగతనం జరిగిన తీరు సిబ్బంది, అధికారుల నిర్లక్ష్య. తదితర అంశాల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయంలోని ఆభరణాలకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయలేదని కార్యనిర్వహణాధికారినీ, ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆలయాన్ని రక్షించుకునే బాధ్యత అర్చకులదే అంటూ అధికారుల, అర్చకులపై అసహనం వ్యక్తం చేశారు.

జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని, కొండపై షెల్ టవర్ నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చేయాలని అధికారులను. ఎమ్మెల్యే ఆదేశించారు.