కొండగట్టు భక్తుల దొంగలు అరెస్ట్ రిమాండ్!జగిత్యాల  డి.ఎస్.పి  ప్రకాష్ !

J. SURENDER KUMAR,

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న వసతి గృహంలో భక్తుల సొమ్ము చోరీకి పాల్పడ్డ 5 గురిని  మల్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు బుధవారం జగిత్యాల డిఎస్పి ప్రకాష్ తెలిపారు.

5 గురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు, నిన్న హోళి పండగ రోజున భక్తులు అద్దెకు తీసుకుని దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి 11, 16, 17 నంబర్లుగల గదుల తాళాలు పగుల గొట్టి సెల్‌ఫోన్లు నగదును ఎత్తుకెళ్లారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు.. రిమాండుకు తరలించిన వారిలో వేములవాడకు చెందిన దూలమ్‌ శశాంక్‌, తోకల నితిన్‌, ఎనగందుల పవన్‌తోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు.. ఒక కారు అద్దెకు తీసుకుని కొండగట్టు చేరుకుని జల్సాల కోసం ఈ దొంగతానికి పాల్పడ్డట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు.