ఎమ్మెల్సీ కవిత ఈడీకి రాసిన లేఖలో కీలక విషయాలు !
J.SURENDER KUMAR
గురువారం ఢిల్లీలో E.D కార్యాలయంలో విచారణకు హాజరు కాకుండా, తన న్యాయవాది ద్వారా E.D అధికారులకు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలో పలు కీలక అంశాలను, న్యాయస్థానాల తీర్పులను పేర్కొంటూ 6 పేజీల లేఖ లో ఆమె 16 అంశాలు పేర్కొంది.

👉 మహిళలను ఆఫీస్‌కు పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధంగానే ఉన్నాను.
👉 అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని ఇదివరకే మీకు చెప్పాను.
👉 అయితే నా విజ్ఞప్తిని మీరు అంగీకరించలేదు. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగాపెట్టి నన్ను ప్రశ్నించాలని చెప్పారు.
👉 చట్టప్రకారం నాకు హక్కులు ఉన్నప్పటికీ మీ మాటను అంగీరించి ఈనెల 11న జరిగిన విచారణకు హాజరై పూర్తిగా సహకరించాను.
👉 మీరు (ఈడీ అధికారులు) అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చాను.
👉 అయినా చట్ట విరద్ధంగా నా ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ నేరంతో నా ఫోన్‌కు ఏం సంబంధమో కూడా చెప్పలేదు.
👉 మీ చర్య నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించింది.
👉 ఈనెల 11న రాత్రి 8:30 గంటల వరకు ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. మళ్లీ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు.
👉 వ్యక్తిగతంగా (In Person) రావాలని మీరు ఇచ్చిన సమన్లలో ఎక్కడా పేర్కొనలేదు.
👉 అందుకే మీరు అడిగిన డాక్యుమెంట్లతో నా ప్రతినిధి సోమా భరత్ ద్వారా పంపుతున్నాను.
👉 ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే 11న మీరు మాట తప్పారు.
👉 ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగా విచారించడానికే నేను వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పినా.. అలాంటిదేమీ జరగలేదు.
👉 ఎందుకని నేను అడిగిన ప్రశ్నలకు మా ప్లాన్ మార్చుకున్నామని మీ అధికారులు (ఈడీ అధికారులు) చెప్పారు.
👉 దీంతో విచారణ చట్టబద్ధంగా జరగలేదని నేను భావిస్తున్నాను. అందుకే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను.
👉 ఈ పిటిషన్ ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. కనుక సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు వచ్చే వరకు ఈడీ సమన్ల విషయంలో వేచి ఉండాలి.
👉 ఈడీ ముందు మహిళ విచారణకు హాజరుకావడంపై కూడా పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది.
👉 కనుక తదుపరి ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వాయిదా వేయమని కోరుతున్నాను.
👉 ప్రజాప్రతినిధిగా, ఒక మహిళగా నాకు ఉన్న హక్కులను హరించరాదు’ అని ఈడీకి పంపిన లేఖలో కవిత వివరంగా రాసుకొచ్చారు.
