J. SURENDER KUMAR,
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చల్గల్ మ్యాంగో మార్కెట్ యార్డ్ అవరణలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని నియోజకవర్గం లో మహిళ సంఘాలకు మంజూరైన ₹10 కోట్ల రుణాల ప్రొసీడింగ్స్ కాపీలను మహిళ సంఘాల కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు.
మహిళ అధికారులు, మహిళా ప్రజా ప్రతినిధుల ను శాలువా తో సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, అనంతరం మహిళ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ డా చంద్ర శేకర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ లు బి ఎస్ లత, మంద మకరందు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మి నారాయణ,జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, కొప్పుల ట్రస్ట్ ఛైర్మెన్ కొప్పుల స్నేహాలత మాజీ amc ఛైర్మెన్ శీలం ప్రియాంక, ఎమ్మెల్యే డా.సంజయ్ సతీమణి రాధిక సంజయ్, సర్పంచ్ ఎల్ల గంగ నర్సు రాజన్న, ఉప సర్పంచ్ పద్మ, amc వైస్ చైర్మన్ అసిఫ్, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
