డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !
J. SURENDER KUMAR,
ధర్మపురి మండలం దొంతాపూర్
లోని ప్రభుత్వ ఎస్సి గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని అకారణంగా కొట్టిన ఉపాధ్యాయులపై మంత్రి కొప్పులఈశ్వర్ స్పందించి. బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు విచక్షణారహితంగా కొట్టడంతో ధర్మపురి ఆసుపత్రిలో చేరిన విద్యార్థి సాయి సందీప్ , వారి కుటుంబ సభ్యులను లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం సాయి సందిప్ ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారుల ద్వారా ఈ సంఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి పి.టి సురేష్ నీ వెంటనే విధుల నుంచి తొలగించి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన బట్ల దినేష్ ,నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, సిపతి సత్తన్న, ఆశెట్టి శ్రీనివాస్, అప్పం తిరుపతి, ప్రశాంత్, పోషయ్యా, తదితరులు ఉన్నారు.