మెట్ పల్లిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ను ప్రారంభించిన రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి !


J. Surender Kumar,.


మెట్ పల్లిలో శనివారం నూతన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ను రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ బృందం రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తులకు గౌరవ వందనం చేశారు.

అంతకుముందు రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోరుట్ల పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కు సంబంధించిన రెండు కోర్టు కాంప్లెక్స్ లు, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో హైకోర్టు జడ్జి లు నవీన్ రావు, శ్రీమతి శ్రీదేవి, శ్రీమతి అనుపమ చక్రవర్తి, సంతోష్ రెడ్డి, పుల్ల కార్తీక్, ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ భాస్కర్, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.