ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి గెలుపు పట్ల ఆ పార్టీ సంబరాలు!


J. Surender Kumar,

హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన AVN రెడ్డి ఘనవిజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ , జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి, భూమి రమణ రాగిల సత్యనారాయణ , రైతు నాయకులు పన్నాల తిరుపతి ,కొక్కు గంగాధర్, నలువాల తిరుపతి బిజెపి నాయకులు పాల్గొన్నారు..

తపాస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో..

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థి AVN రెడ్డి గెలుపొందిన సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ తరపున విజయోత్సవ సంబరాలు నిర్వహించి, స్వీట్స్ పంచారు.,
ఈ కార్యక్రమంలో తపాస్ జిల్లా అధ్యక్షులు భోనగిరి దేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇది గుణపాఠం కావాలని ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర అసోసియేటెడ్ అద్యక్షులు అయిల్నేని నరేందర్ రావు మాట్లాడుతూ సమస్యల సాధనలో ముందున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం అనేది ఉపాధ్యాయ లోకానికి శుభ సూచకంగా భావిస్తున్నామని, రాష్ట్ర ఉపాధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ ఈ గెలుపు ఉపాధ్యాయ ఉద్యోగ మేధావి వర్గం కలిసికట్టుగా గెలిచిన గెలుపుగా భావించి ప్రభుత్వానికి తొత్తుగా మారిన ఇతర సంఘాలకు ఈ గెలుపు గుణపాఠం కావాలని సూచించారు.,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు రొట్టె శ్రీనివాస్, జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు మహేశ్వర్ శర్మ, జొన్నల పూర్ణచంద్ర, తీగల శ్రీనివాస్, రజనీకాంత్, గంగాధర్ రాజేందర్, రవి . కాశిట్టి రమేష్ కోరుట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.