J.SURENDER KUMAR,
ఢిల్లీలో నేడు ఈ. డీ విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, లాయర్ సోమ భరత్ తో ఈడి కార్యాలయానికి లేఖ పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో చట్టాలను, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవపాసన పట్టిన అపర న్యాయ కోవిదులు , రాజ్యాంగ నిపుణులు, ఉండగా సోమ భరత్ రంగప్రవేశంతో ఈ సోమ భరత్ ఎవరు అనే చర్చ నెలకొంది.
MLC కవిత ఇవాళ విచారణకు హాజరుకాబోదని ఈడీకి చెప్పిన లాయర్ సోమ భరత్ స్వస్థలం సూర్యాపేట జిల్లా వర్ధమానుకోట. KCRతో రెండు దశాబ్దాలకు పైగా సన్నిహిత సంబంధాలున్న భరత్.. TRS వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయన.. పార్టీకి అత్యంత విధేయుల్లో ఒకరు. ప్రస్తుతం BRS ప్రధాన కార్యదర్శిగా ఉన్న భరత్.. గతేడాది తెలంగాణ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య సంస్థ. (TSDDCFL) ఛైర్మన్ గా నియమితులయ్యారు.