మోడీని బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఇరికించాలని ప్రయత్నించారు!

హోం మంత్రి అమిత్ షా!

J. Surender Kumar,
గత యూపీఏ హయాంలో ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీని, బూటకపు ఎన్ కౌంటర్ కేసులలో ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందు కోసం సీబీఐ నాపై ఒత్తిడి తెచ్చింది అని కేంద్ర హోం శాఖ మంత్రి    అమిత్ షా తెలిపారు.  ఢిల్లీలో ఓ ఆంగ్ల ఛానల్.   న్యూస్ 18 రైజింగ్ ఇండియా’ బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,  .. ‘‘చట్టం ప్రకారం రాహుల్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. అందులో మా ప్రమేయం లేదు.  ఆయన కేవలం ప్రధాని మోదీపై దాడి చేయలేదు, వెనుక బడిన కులాలను, మోదీనీ అవమానించారన్నారు. 

నేరారోపణ స్వయంగా అనర్హతకు దారి తీస్తుంది. ఇది మన దేశ చట్టం. కానీ అతనికి న్యాయస్థానం విధించిన శిక్షకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడానికి బదులుగా, అతను మమ్మల్ని నిందిస్తున్నాడు అని షా అన్నారు. ఎంపీ కావాలనుకున్నా కోర్టుకు వెళ్లరు. ఇదేమి ఘోరమో నాకు అర్థం కావడం లేదు అని అమిత్ షా అన్నారు .

గతంలో జయలలిత, లాలూ సహా, 17 మందికి ఇలా శిక్ష పడింది. నల్ల చొక్కా ధరించి ఎవరూ పోరాడలేదు. కానీ రాహుల్ మాత్రం మేమే తప్పు పట్టినట్లు మాట్లాడుతున్నారు.

రాహుల్ గాంధీ విషయంలో మేం ఎవరి పై ఒత్తిడి చేయడం లేదు అన్నారు.