10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ…
రేపు మళ్లీ విచారణకు ?
J.SURENDER KUMAR,
లిక్కర్ కుంభకోణంలో సోమవారం ఈ డి చేపట్టిన ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే అంశంపై రేపు విచారణకు రావాలని పిడి సామాన్లు జారీ చేసినట్టు అనధికారిక సమాచారం. విచారణ ముగియడంతో
ఢిల్లీ పోలీసుల ఎస్కార్ట్ వాహనంతో కాన్వాయ్ ఏర్పాటు…అభివాదం చేస్తూ వాహనంలో ఎక్కిన ఎమ్మెల్సీ కవిత…ఈడీ కార్యాలయం నుంచి తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్ళై కలిపి కవితను ప్రశ్నించిన ఈడీ…ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను విచారించిన ఈడీ.. విచారించినట్టు సమాచారం.
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. అంటే దాదాపు 10 గంటలపాటు కవితను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత ఎలాంటి సమాధానాలు ఇచ్చారో తెలియాల్సి ఉంది.

కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు అనేది చర్చ. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం 6:30 గంటలు అయినా ఇంతవరకూ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రెండో రోజు విచారణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అసలు ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
ఒక్కసారిగా మారిన సీన్..!
మరోవైపు.. ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. న్యాయవాదులు ఎందుకొచ్చారు..? కవితను అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా..? అనేది బీఆర్ఎస్ పెద్దలకు అర్థం కావట్లేదు. ఉదయం నుంచి ఈడీ కార్యాలయం చుట్టుపక్కలా పరిస్థితి అంతా సాధారణంగానే ఉంది. అయితే.. ఆఫీసు దగ్గరికి న్యాయవాదులు వచ్చేసరికి ఒక్కసారిగా హస్తినలో సీన్ మారిపోయింది. దీంతో ఏం జరుగుతోందో ఏంటో అని బీఆర్ఎస్ శ్రేణులు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు.
డాక్టర్లు ఎందుకు..?
మరోవైపు.. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది.
రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవితను మళ్లీ తిరిగి ఈడి విచారణకు రావాలని ఈడి ఆదేశించినట్టు చర్చ.