నరసింహుడి దర్శనం కోసం బారులు తీరిన భక్తజనం!

బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు న..

J. Surender Kumar,.

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులను స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరి గంటల తరబడి వేచి ఉన్నారు.

శనివారం సాయంత్రం శ్రీ స్వామి వారల కళ్యాణం, స్థానిక శేషప్ప కళా వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది

ఈ కళ్యాణం కూడా పెంచడానికి వేలాదిమంది భక్తులు తరలిరావడంతో క్షేత్రం పోటెత్తింది. రాత్రి క్షేత్రంలోని నిద్రించిన వేలాది మంది భక్తులు ఆదివారం తెల్లవారుజామునే గోదావరి నది లో పవిత్ర స్నానాలు ఆచరించి

, స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. వేలాది మంది భక్తజనం కు స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఉత్సవాలు ముగిసే వరకు నిరంతరంగా కొనసాగిస్తున్నారు.

ఆలయ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్తు, పారిశుద్ధ్య, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ, అధికారులు, సిబ్బంది. అనుక్షణం అప్రమత్తంతో భక్తుల సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నారు

. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో సేద తీర్చే భక్తుల కోసం శేషప్ప కళా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.