J.SURENDER KUMAR,
ఉగాది పర్వదినం బుధవారం ధర్మపురికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి కళాకారులను 11వ వార్డు కౌన్సిలర్ జక్కు పద్మా రవీందర్ ఆధ్వర్యంలో 27 మంది కళాకారులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమనికి అతిథులుగా వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, తిమ్మాపూర్ సింగిల్ విండో చైర్మన్ సాయిని సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగనభట్ల దినేష్ , డాక్టర్ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్ ప్రముఖ కవి మాడిశెట్టి శ్రీనివాస్ , కౌన్సిలర్ సంఘన భట్ల సంతోషి మరియు సన్మానితులు సీనియర్ రిపోర్టర్ సంగనభట్ల రామ కిష్టయ్య, కోరిడే నరహరి , పెండ్యాల బాలకృష్ణ , సంగనభట్ల కిషన్ , సంఘనపట్ల ప్రతిభ, ఇందారపు రామ్ కిషన్ , తదితర కళాకారులను ఘనంగా సన్మానించి, వారి నటన కౌశల్యం, ప్రతిభ , సుదీర్ఘ అనుభవం తదితర అంశాలపై పలువురు వక్తాలు ప్రసంగించారు.