నేడే ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి రథోత్సవం!

జాతర ఉత్సవాలు ప్రధాన ఉత్సవాల్లో ఒకటి!

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో నేడు ఆదివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది.
ఈనెల 3న కలశ స్థాపనతో ప్రారంభమైన స్వామి వారి జాతర ఉత్సవాలలో  4న స్వామి వారి కళ్యాణ మహోత్సవం 7,8,9న యోగ నారసింహ ఉగ్ర నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం డోలోత్సవము  బ్రహ్మ పుష్కరిణిలో ఘనంగా జరిగింది.

ఆదివారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు. మూడు రథములపై  ఉంచి ప్రత్యేక పూజలు, బలిహరణాల తర్వాత, భక్తుల సందర్శనం అనంతరం వేలాది మంది భక్తజనం గోవింద నామస్మరణలు, హర హర మహాదేవ, అంటూ భక్తి పరవశంతో  నినాదాలు చేస్తూ, స్వామివారి రథములను క్షేత్ర పురవీధుల గుండా బ్రహ్మ పుష్కరిణి ,ఇసుక స్తంభం, నంది విగ్రహం వరకు, ఊరేగిస్తారు.

అనంతరం అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను  పవిత్ర గోదావరి నది లో చక్ర స్నానం , ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రంలో ఊరేగిస్తారు. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం మేరకు మధ్వాచారి వంశీయుల ఇంటి లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం వారు మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లను భక్తులకు ఉచితంగా అందిస్తారు.
ఈ ఉత్సవం తిలకించడానికి వేలాదిమంది భక్తజనం క్షేత్రానికి తరలి వస్తారు. పోలీస్ యంత్రాంగం అలాంటి అపస్తులు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.