జాతర ఉత్సవాల్లో….
J.SURENDER KUMAR
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ జాతర ఉత్సవాలలో ప్రధాన ఉత్సవాలలో ఒకటైన శ్రీ యోగా నరసింహ స్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవం మంగళవారం సాయంత్రం స్థానిక బ్రహ్మ పుష్కరిణిలో ( కోనేరులో) జరగనున్నది.
రాతితో కట్టిన అతి పురాతనమైన దాదాపు 5 ఎకరాల విశాలమైన కోనేటి నీటిలో తెప్ప పై స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.
ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించడానికి, వేలాది మంది భక్తజనం కోనేటి నలువైపుల గల రాతి మెట్ల పై కూర్చుండి తిలకిస్తారు, ( స్టేడియం తరహాలో) ఐదు ప్రదక్షిణల అనంతరం స్వామివారిని కోనేటి మధ్యలో గల మండపంలో ఊయల ఊపుతారు.

దీనిని డోలోత్సవం అంటారు. స్వామివారి తేపోత్సవం, డోలోత్సవం లో భక్తులు పసుపు, కుంకుమ, బుక్క గులాలు స్వామి పై చల్లుతారు. హోలీ పర్వదిన సందర్భంగా స్వామివారు, అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు, సైతం స్వామివారిపై భక్తులు చల్లే బుక్క గులాల రంగులు వారిపై పడి వారు తన్మయత్నం చెందుతారు.