స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం లో..
J. SURENDER KUMAR,
ధర్మపురి లోని స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం, కన్వీనర్ డాక్టర్ గొల్లపల్లి గణేష్, పేద విద్యార్థిని కి నాలుగు విద్యా సంవత్సరాల కళాశాల ఫీజులను చెల్లించడానికి హామీ ఇస్తూ ఆ విద్యార్థినికి మొదటి సంవత్సరం ₹ 30, వేల ఫీజు కళాశాలకు చెల్లించారు.
వివరాల్లోకి వెళితే
ధర్మపురికి చెందిన విద్యార్థి మసీదు మేఘన కు అనస్థీషియా టెక్నాలజీ కోర్సులో నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ సాధించింది. అయితే ఆ అమ్మాయి చదువుకు సంవత్సరానికి 30 వేల రూపాయల చెల్లించాల్సి రావడంతో, ఆ ఖర్చులు భరించే స్థితిలో తన కుటుంబం లేకపోవడంతో ఆ విద్యార్థిని కుటుంబం కు చదివించలేని దుస్థితి ఏర్పడింది. స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా దాతల సహకారంతో ఆ విద్యార్థిని దత్తత తీసుకొని చదివించడానికి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా విద్యార్థి నాలుగు సంవత్సరాల చదువుకు అయ్యే ఖర్చులు ₹. 1.24 లక్షాలు చెల్లించడానికి అమెరికాలో ఉంటున్న ధర్మపురికి చెందిన NRI కశోజ్జల చంద్రశేఖర్ ముందుకు వచ్చారు. అందుకు గాను మొదటి సంవత్సరం ఖర్చులు ₹ 30 వేలు అమ్మాయికి అందజేయడం జరిగింది. వారికి సంస్థ తరుపున ధన్యవాదాలు. కార్యక్రమంలో SAP కన్వీనర్ గొల్లపెల్లి గణేశ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డా. రామకృష్ణ, SAP సభ్యులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.