పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు!


కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ!

J.Surender Kumar,

పాన్ కార్డుకు, ఆధార్ నెంబర్ లింక్ చేయనివారు  పాన్-ఆధార్ లింక్ గడువును   జూన్ 30, 2023  వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు, ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన!

ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని తెలిపింది. అలా లింక్ చేయని వారి పాన్ కార్డులు 2023 ఏప్రిల్ 1 నుంచి  చెల్లవని గతంలో హెచ్చరించింది.  తాజాగా దానిని  జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది