పెరిగిన సిలిండర్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి!

రాజస్థాన్ లో ₹ 500 కే సిలిండర్ !

పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

యూపీఏ పాలనలో కేంద్రం ₹.50 ధర పెంచితే రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేద ఆడ బిడ్డలపై భారం పడకుండా పెంచిన ధర భారం ₹.50 రాష్ట్ర ప్రభుత్వమే భరించింది  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మొసలి కన్నీరు కార్చకుండ చిత్తశుద్ది ఉంటే  నిరుపేద ల పై ₹ 50 భారం పడకుండా ప్రభుత్వమే భరించాలన్నారు.

రాజస్థాన్ లోని కాంగ్రెస్ పాలన లోని ప్రభుత్వం  ₹ 500 లకే సిలిండర్ ఇస్తోందని, అవసరమైతే అక్కడికి వెళ్లి పరిశీలించాలని అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ డీ ఏ ప్రభుత్వం పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై మేము కూడా బీ ఆర్ ఎస్ తో కలిసి వస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాలు విసిరారు.
2009లో  కాంగ్రెస్ పాలనలో నిరుపేదల కోసం స్థల సేకరణ చేపట్టి, నాలుగు వేల మందికి మౌలిక వసతులు రూపొందించి ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు.
2017 లో జగిత్యాల పై అప్పటి ఎంపి కవిత  తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 4000 ఇళ్లు మంజూరు చేయించారు. ఎట్టకేలకు డబుల్ బెడ్రూం ఇళ్ల  కేటాయింపు ఓ కొలిక్కి రావడం సంతోషం అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇస్తామని  వాగ్దానం చేశారని, గతేడాది బడ్జెట్ లో నియోజక వర్గానికి 3000 చొప్పున ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఆర్థిక సంవత్సరం ముగిసెందుకు వచ్చినా ఒక్క ఇళ్లు కూడా నిర్మించ లేదన్నారు.
జగిత్యాల పట్టణం లో ఈ 3న హాథ్ సే హాథ్ జో డో చేపట్టనున్నామాని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జో డో యాత్ర కు అనుబంధంగా హాథ్ సే హాథ్ జో డో చేపట్టామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తోపాటు, కాంగ్రెస్ పాలన లో చేపట్టిన పథకాలు వివరిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.
కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగ భూషణం, పిసిసి ఆర్గనైజేషన్ సెక్రెటరీ బండ శంకర్, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొత్తమోహన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేప ల్లి దుర్గయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ పులి రాము పుప్పాల అశోక్ రమేష్ రావు బింగి రవి, కోర్టు శ్రీను,  దయ్యాల శంకర్, పిసిసి ఎన్ఆర్ఐ కన్వీనర్ చాంద్ పాషా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మహిపాల్, రాజేష్,విజయ్, రజనీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్ లో చేరిక !

ధర్మపురి మండలం దమ్మనపేట గ్రామానికి చెందిన దూడ లక్ష్మణ్ గారు గురువారం రోజున జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో లో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్  పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగన బట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జైన ఎంపీటీసీ కుంట సుధాకర్ తదతరులు పాల్గొన్నారు.