ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !

మతసామరస్యానికి ప్రతీక ధర్మపురి జాతరలో

J. SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది ! ధర్మపురి క్షేత్రంలో మసీదు, ఆలయం పక్కపక్కనే ఉండీ మతసామరస్యానికి ప్రతీక గా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం శేషప్ప కళావేదికపై జరగనున్న స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తలంబ్రాలు పట్టు వస్త్రాలు అందజేస్తారు.


సాంప్రదాయ పద్ధతిలో తలంబ్రాలు సమర్పించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !

ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష , ఆలయ సాంప్రదాయం పద్ధతి లో అర్చకులు, వేద పండితుల వివరించిన విధంగా తలపాగా చుట్టించుకొని, నుదుట తిలకం దిద్దించుకొని, స్వామివారి దర్శించుకొని

, తీర్థప్రసాదాలు స్వీకరించి, పట్టు వస్త్రాలు, తలంబ్రాల పళ్లెం, తలపై పెట్టుకుని మంగళ, వాయిద్యాలు , వేదమంత్రాలు పటిస్తుండగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి అందించారు.

స్వామి వారి కళ్యాణం ఫైల్ ఫోటో


శనివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం!


జాతర ఉత్సవాలు ప్రధాన ఉత్సవం స్వామివారి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది.

తిలకించడానికి నిజామాబాద్ , నాందేడ్, నాగపూర్, చంద్రాపూర్ ఇతర రాష్ట్రాల నుండి, భారీ సంఖ్య లో భక్తజనం రానున్నారు. 15 రోజులపాటు భక్తులకు ఉచిత అన్నదాన కొనసాగన ఉన్నది. ఈ కార్యక్రమాన్ని స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో కలెక్టర్ టెంకాయ కొట్టి ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

బొట్టు పెట్టించుకుని..
తీర్థం తీసుకొని..
తల కు పట్టు వస్త్రం చుట్టించుకొని..
తలంబ్రాలు సమర్పించడానికి సిద్ధంగా…
మతసామరస్యానికి ప్రత్యేకంగా మసీదు ఆలయం పక్కపక్కనే..
కళ్యాణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి అలంకరణ..
పట్టు వస్త్రాలు తలంబ్రాలతో ప్రదక్షణ…