పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి.!
J.SURENDER KUMAR,
ప్రజాస్వామ్యంలో ప్రసార సాధనాల స్వేచ్ఛను హరించెలా అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే రాయితీలు నిలిపి వేస్తూ, దాడులు చేస్తే వాస్తవాలు వెలికి ఎలా వస్తాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడారు.
భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఫోర్త్ ఎస్టేట్ సహకారం తో తెలంగాణ రాష్ట్ర సాధన కల నిజమైందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వాటి లోపాలను ఎత్తి చూపుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రసార సాధనాల ఎనలేని కృషి చేస్తున్నాయి. వీ6, క్యూ, న్యూస్ పై దాడి హేయమైన చర్య అని, ప్రజాస్వామ్య వాదులు ప్రసార సాధనాల పై దాడులను ఖండించాలని ప్రసార సాధనాలపై ఆంక్షలు, చర్యలు సరికాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు, వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చారు.
టీఎస్పీఎస్సీ పేపర్లు లీకేజీ తో లక్షలాది మంది నిరుద్యోగ యువత క్షోభ పడుతోందని, చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇంకా కుర్చీ పట్టుకుని వేలాడడం సిగ్గుచేటు అన్నారు.
కాన్ఫిడెన్షియల్ గదిలోకి ప్రవీణ్ రాజశేఖర్ వెళ్లడం చైర్మన్ వైఫల్యం కాదని ప్రశ్నించారు.
గతంలో జనార్దన్ రెడ్డి కమిషనర్ గా ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో సైతం 60 వేల మార్కు సీట్లు తప్పిదాలు జరిగాయని, సుమారు 30 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కి బాధ్యత వహించాల్సిన చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తో లక్షలాది మంది నిరుద్యోగ యువత విశ్వాసం కోల్పోయి, నైరాశ్యంలో ఉంది.
సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సీటు విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలి..
యువతలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత సీఎం కెసిఆర్ పై ఉంది.
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలం, నీరు, విద్యుత్ రాయితీలు ఇస్తున్నా ఉపాధి లో రిజర్వేషన్ కల్పించకపోవడం తో తెలంగాణ నిరుద్యోగ యువత కు ఉపాధి లభించడం లేదన్నారు. ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాటా ఎంతో చెప్పాలని
చట్టసభల్లో ప్రశ్నిస్తే తమవద్ద వివరాలు అందుబాటులో లేవని మంత్రి కేటీఆర్ చెప్పారని, మరో సందర్భంలో మంత్రి హరీష్ రావు ని ప్రశ్నిస్తే కేటరింగ్ సర్వీస్ లో ఉన్నాయి కదా అని ఎద్దేవా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో నవీన్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడితే ఆయన కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ ఆదుకుంటానని భరోసా ఇవ్వడం సంతోషకరమని, కానీ కొట్లాడి, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఒక నిరుద్యోగ యువకుడు బలవన్మరణానికి పాల్పడితే కానీ ఆ కుటుంబానికి ఆసరా లభించని దుస్థితి బాధాకరమన్నారు.వాస్తవాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నామంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకు ప్రైవేట్ రంగం లో 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని గుర్తు చేశారు.
తెలంగాణలో కనీసం 50 శాతమైనా ప్రైవేట్ రంగం లో సామాజిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి.
ప్రైవేట్ రంగం లో 50 శాతం తెలంగాణ నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేలా
కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టేలా బాధ్యత తీసుకుంటానని జీవన్ రెడ్డి అన్నారు.
టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ తో నిరుద్యోగులు నైరాశ్యంలో ఉన్నారని, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి రు.1లక్ష పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలన్నారు.