నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం !
J. Surender Kumar,
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల ధర్మపురి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు శుక్రవారం దగ్ధం చేశారు.
ఈ సంద్భంగా అడ్లూరి లక్ష్మన్ కుమార్ మాట్లాడుతూ…రాహుల్ గాంధీ పైన వేసిన అనర్హత వేటు ను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని..ఇందిరా గాంధీ ,రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారనీ, రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం కష్టపడుతున్నరనీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టువంటిదని, లక్ష్మణ్ కుమార్ అన్నారు.

అదానీ – మోడీ చీకటి స్నేహం పై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం వల్లనే కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేసి రాహుల్ గాంధీ , సభ్యత్వాన్ని రద్దు చెయ్యడం జరిగిందని అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నయని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని, బీజేపీ ప్రభుత్వన్ని హెచ్చరించారు…
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగన బట్ల దినేష్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహ రాజు ప్రసాద్, జైన ఎంపీటీసీ బ్లాక్ కాంగ్రెస్ 1అద్యక్షులు కుంట సుధాకర్, ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేని మొగిలి, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపధ్యక్షుడు వేముల రాజేష్, జైన ఉప సర్పంచ్ కోరుట్ల శ్రీను, సీపతి సత్యనారాయణ, అయ్యోరీ మహేష్, చిలుముల లక్ష్మన్, .ఈఫ్తికర్ రఫియొద్ధిన్, పోచయ్య, నరసింహులు, మల్లేష్, దేవవరం, ప్రశాంత్, సుముక్, షబ్బీర్, మహేందర్, ముత్తినేని మల్లేష్, ఇంద్రాల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు..