రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం ఉద్యోగుల పని వేళలు తగ్గింపు!

మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు

J.SURENDER KUMAR,

రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు/కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్/బోర్డులు/ప్రభుత్వ రంగ ఉద్యోగులు అందరూ ప్రార్థనలు చేసేందుకు కార్యాలయాలు/పాఠశాలల నుంచి గంట ముందుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ ఉత్తర్వులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటాయి.
టీఎస్‌-ఎంఎస్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.