రైతు భాందవుడు కేసిఆర్ – బీ అర్ ఎస్ రైతు పక్షపాతి ప్రభుత్వం!

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!

J.SURENDER KUMAR,

రైతుబంధు రైతు బీమా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ కర్త సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
రూరల్ మండల పోరండ్ల గ్రామంలో పాక్స్ అధ్వర్యంలో ₹ 23 లక్షల తో 300 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం తో నూతనంగా నిర్మించిన గోదాం ను బుధవారం ఆయన ప్రారంభించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ₹ 36 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం ₹15 లక్షలతో 2 సీసీ రోడ్లు,₹ 1.50లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసి, గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ది దారులకు సీఎం సహయనిది ద్వారా మంజూరైన ₹1 లక్షల 5 వేల రూపాయల చెక్కులను అందజేశారు.


ఈ కార్యక్రమంలో పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ,సర్పంచ్ సంధ్యారాణి, ఎంపిటిసి సౌజన్య తిరుపతి,రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,జిల్లా HCA మెంబర్ దావా సురేష్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉప అధ్యక్షులు నాగిరెడ్డి గంగారెడ్డి, పాక్స్ డైరెక్టర్ లు


సర్పంచులుదామోదర్,భూపతి రెడ్డి,శేకర్,రమణ రావు,ఎంపీటీసీ రెడ్డి రత్న రవి,గ్రామ నాయకులు ఆరే రవి, పడిగెలగంగారెడ్డి,నక్క హరీష్,మధు,రవి, కర్నాల శ్రీనివాస్,నాయకులు,కార్యకర్తలు,ప్రజలు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ


పోరండ్ల గ్రామానికి చెందిన పల్లె గంగారాం, ముద్దం ఆనందం ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.
తీట్ల భీమయ్య అనారోగ్యం తో భాద పడుతూ ఉండగా,మంద చంద్రవ్వ ప్రమాద వశాత్తూ గాయపడగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్తితినీ అడిగి తెలుసుకున్నారు.
ఎల్లమ్మ పట్నాలు!


రూరల్ మండలం సంగంపల్లి సోమనపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాల జాతర కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రేణుక ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేశారు
.