రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి !
ఫసల్ బీమా యోజన అమలు చేయండి!

మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ భోగశ్రావణి !

J.SURENDER KUMAR,

జగిత్యాల అర్బన్ మం. మోతే గ్రామంలో గత రెండురోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతు సంగెo భూమయ్య యొక్క మొక్కజొన్న పంట నష్టం జరగగా వారితో కలిసి ఆదివారం పంటలను బీజేపీ నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ Dr. బోగ శ్రావణి పరిశీలించారు.

ఈ సందర్భంగా డా. బోగ.శ్రావణి మట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలి నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 నష్టపరిహారం అందజేయాలి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలుపరచాలి అని డిమాండ్ చేశారు. జగిత్యాల అగ్రికల్చర్ ఆఫీసర్ వెంటనే జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన పంటనష్టం ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నివేదించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ పార్టీ తరుపున డిమాండ్ చేశారు.


ఆమె వెంట జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, అర్బన్ మండల యువ మోర్చా అధ్యక్షులు బొల్లం అజయ్,కిసాన్ మోర్చా రూరల్ మండల అధ్యక్షులు పెంట హరీష్, మోతే గ్రామ బీజేపీ నాయకులు సునీత్ పటేల్,దానపునేని నితిన్, ఆరుముళ్ల అజయ్ బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు