J.SURENDER KUMAR,.
ధర్మపురి ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు బుధవారం అంగన్వాడి. కార్యకర్తలు ధర్నా జరిగింది. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు రోజుల సమ్మెలో భాగంగా ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి కే సునీత , ,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి జ్యోతి పాల్గొని మాట్లాడారు.

అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని ,పెండింగ్ టిఏడిఏలుచెల్లించాలని ఆరోగ్య లక్ష్మి, మెనూ చార్జీలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ,ఎన్ హెచ్ టి ఎస్ ఆన్లైన్ యాప్ ను రద్దు చేయాలని, తదితర ప్రధానమైన డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.. అనంతరం సిడిపిఓ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ నాయకులు జె మాధవి ,రాజ్యలక్ష్మి, జక్కుల శ్రీదేవి, శంకరమ్మ, కళావతి, భూలక్ష్మి ,సుమలత ,శ్రీదేవి అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.