సంక్షేమమే సంఘాల అంతిమ లక్ష్యం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం !


J. Surender Kumar,

జగిత్యాల పట్టణం గీతా భవనంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది . దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం, జ్యోతిష్య పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక ఆధ్వర్యంలో నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోతే ఉమాకాంత్ శర్మ, సిరిసిల్ల కపిల్ శర్మ, ఉపాధ్యక్షుడు బండపల్లి కార్తీక్ శర్మ, కార్యవర్గ సభ్యులు మహిళా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ సంఘంలోని అభిప్రాయం మేరకు సంక్షేమం కోసం కృషి చేయడం కర్తవ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కరించుకొని నూతన పంచాంగాలు నూతన సంవత్సరంలోని తదితరాలకు సంబంధించిన కరదీపికను ఆవిష్కరించారు ముఖ్య అతిథులకు జ్ఞాపికలు బహుకరించి సన్మానించారు. వివిధ కుల సంఘాల నాయకులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ , ఎంపీపీ పాలెపు రాజేంద్రప్రసాద్ , పౌలస్తేశ్వర, ధర్మపురి దేవస్థానాల అధ్యక్షులు మర్రిపల్లి కొండలరావు ఇందారం రామన్న, మాజీ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్ ,కంజర్ల ఆనంతా చార్యులు, చాకుంట వేణుగోపాలరావు, పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు