సోమవారం కూడా ఎమ్మెల్సీ కవిత ను E.D విచారించనున్నదా ?

అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఉపసంహరణ కోర్టులో

పిటీషన్ , లిస్టింగ్ తేది 13 మార్చ్ !

J.SURENDER KUMAR,

ఎమ్మెల్సీ కవిత శనివారం ఢిల్లీలో E.D. విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె సోమవారం మార్చి 13, న కూడా లిక్కర్ అంశంలో విచారణ కొనసాగనున్నదా ? లేదా ? అనే చర్చ జరుగుతుంది.
హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అరుణ్ పిళ్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మార్చ్ 5 న విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అతడు ఇచ్చిన సమాచారం మేరకు.
ఎమ్మెల్సీ కవితను మార్చి 9న విచారణ కోసం ED పిలిపించింది,

అయితే ఆమె శుక్రవారం దేశ రాజధానిలో ఆమె నిరాహారదీక్షను ఉటంకిస్తూ తన విచారణను మార్చి 11కి వాయిదా వేయాలని దర్యాప్తు సంస్థను కోరింది . మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో త్వరగా ఆమోదించాలని కోరుతూ కవిత నిరసన చేపట్టారు..

శుక్రవారం, కె కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఇచ్చిన తన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. తన


వాంగ్మూలాలను E.D బలవంతంగా నమోదు చేశారంటూ పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయం మార్చి 13, సోమవారం విచారణకు లిస్ట్ చేయబడింది. అరుణ్ పిళ్లై పిటిషన్ పై కోర్టు మార్చు 13న ఎలాంటి ప్రకటన చేయనున్నదో ? వేచి చూడాల్సిందే.