J. Surender Kumar,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తరుణ్ జ్యోషి, మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దేవస్థానం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ శ్రీ స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం ఇచ్చి సన్మానించారు.

దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , పాల్గొన్నారు. ఇదే రోజు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

జగిత్యాల జిల్లా S.P A. భాస్కర్ , D.S.P ప్రకాష్ , C.I కోటేశ్వర్, పోలీసు అధికారులు ఐజి వెంట ఉన్నారు.